Monday, August 11, 2008

బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ

బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో అనే అంశంపై రూపొందిన చిత్రం బ్రహ్మానందం డ్రామా కంపెనీ. పల్లి కేశవరావు నిర్మాణంలో ఐ. శ్రీకాంత్ దర్శకత్వంలో తయారైన ఈ చిత్రంలో బ్రహ్మానందం, శివాజీ, రవికిరణ్, రఘు, కమలినీ ముఖర్జీ, అలీ, జీవ, శివాజీరాజా తదితరులు నటించారు. కథ: ఆనందం (బ్రహ్మానందం)కి ఓ డ్రామా కంపెనీ ఉంటుంది. ఆ ట్రూపులో వాసు (శివాజీ), శ్రీను (రవికృష్ణ) హీరోలు. సోని (సమీక్ష) హీరోయిన్. పేరుకు డ్రామా కంపెనీ అయినా చేసేవి మాత్రం డ్యాన్సులు. వాసు, శ్రీనులు హీరోయిన్ అంటే కామంగా చూసే టైపు. అయితే ఆ ట్రూపులో ఉండే సిమ్‌కార్డ్ (హేమ)ను బ్రహ్మానందం అదే బాపతులో చూస్తుంటాడు. ఓ సారి వీరందరూ రవీంద్ర భారతిలో ఓ కార్యక్రమం చేస్తారు. ఈవెంట్ మేనేజర్ ఈ ప్రోగ్రామ్‌ను చూసి బ్యాంకాక్‌లో షో ఏర్పాటు చేసే అవకాశం ఇప్పిస్తాడు.తీరా ఈ ట్రూప్ అంతా బ్యాంకాక్‌కు విమానంలో బయలుదేరే సమయంలో తాను రాలేనంటూ ఓ ఉత్తరం రాసిపెట్టి హీరోయిన్ జంప్ అయిపోతుంది. మేనేజర్‌కు ఈ విషయం చెప్పకుండా రెండు రోజుల్లో వస్తుందని చెప్పి మేనేజ్ చేస్తుంటాడు ఆనందం. ఈలోగా హీరోయిన్‌ను ఎవరు వెతుక్కుని వస్తే వాళ్లే హీరో అని అంటాడు. వాసు, శ్రీను హీరోయిన్ కోసం వెతుకుతుంటారు. వీరికి అక్కడి కారు డ్రైవర్ భల్లూ (అలీ) సహాయపడుతాడు.పార్కులో హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో వీరు హెరాయిన్ కోసం వెతుకుతున్నారని భావించి స్మగ్లర్ టీం రవిబాబు, రాంగజన్‌లు సూట్‌కేస్‌ను వారి చేతుల్లో పెడతారు. ఇంతలో పోలీసు సైరన్ రావడంతో వారు పారిపోతారు. అది హెరాయిన్ అని తెలిసి పోలీసులకు అప్పజెప్పాలని భావించి శ్రీను, వాసులే చిక్కుల్లో ఇరుక్కుంటారు. కాగా, శ్రీను, వాసులకు ఆత్మహత్య చేసుకుంటున్న అర్పిత (కమలినీ ముఖర్జీ) కనిపిస్తుంది. ఆమెను ఎలానో నచ్చజెప్పి ట్రూప్‌లో హీరోయిన్‌గా చేరుస్తారు.అయితో ఆమె సమయం దొరికినప్పుడల్లా ఆత్మహత్యాయత్నం చేస్తుంటుంది. ఆమె సైసైడ్ల్‌టెండెన్సీతో బాధపడుతోందని డాక్టరు చెప్తాడు. ఆ సమయంలోనే ఆమె తన భార్య అంటూ వ్యాపారవేత్త మహేంద్ర (రఘు) వచ్చి అర్పితను తీసుకువెళ్తాడు. దీనితో ఆమెపై ప్రేమను పెంచుకున్న శ్రీను, వాసులు దిగులుపడతారు. ఆ రాత్రి తను కష్టాల్లో ఉన్నానని, వెంటనే వచ్చి కాపాడకుంటే చచ్చిపోతానని అర్పిత నుంచి శ్రీను, వాసులకు ఫోన్ వస్తుంది. వాళ్లు ఆమె ఇంటికి వెళ్లగా, ఆమె ఒళ్లంతా కాలిన గాయాలు ఉండటంతో వారు షాక్‌కు గురవుతారు.కానీ పోలీసులు వీరిని వెంటాడుతూనే ఉంటారు. మరోవైపు స్మగ్లర్ల ముఠా కూడా వీరిని వెంబడిస్తూ ఉంటుంది. వీరంతా ఎందుకు వెంటాడుతుంటారు? తర్వాత ఏమయిందనేది చిత్రంలో చూడాల్సిందే. విశ్లేషణ:హిందీ భాగం భాగ్‌ను రీమేక్ చేసిన చిత్రం ఇది. అందులో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రంలో ఎక్కడా లేదని చెప్పాలి. శివాజీ తన పాత్ర వరకే నటించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో చాలా ఎబ్బెట్టుగా ఉంది. కమలినీ ముఖర్జీ కాస్త ఫర్వాలేదనిపించింది. ధర్మవరపు పాత్ర అంతగా హాస్యాన్ని పండించలేకపోయింది. స్మగ్లర్లుగా చేసిన రవిబాబు, రాంజగన్‌లు హాస్యాన్ని పండించారు. మొత్తానికి డ్రామా కంపెనీ అంటే పిచ్చిగంతులు అనే అర్థం వచ్చేలా ఉంటుంది.

No comments: