Sunday, August 10, 2008

తెలుగు దేశం ప్రాచీనత

ఆంధ్రులను గురించిన అతి ప్రాచీన ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. అటు తరువాతి కాలంలో శ్రీమద్రామయణంలోను, మహాభారతంలోను, పురాణాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన వచ్చింది. మొదటిగా తెలుగువారు ఆర్యకుటుంబంలోని వారే. ఐతే తరువాతి రొజులలో దక్కను ప్రాంతానికి వచ్చి స్థానికులైన ద్రావిడ జాతి వారితో కలిసిపోయారు అనేది చారిత్రకంగా చెప్పబడుతోంది. ఆంధ్రులను గురించి ఆధునక చారిత్రకాధారాలను బట్టి చెప్పేవారు క్రీస్తు పూర్వం 4 వ శతాబ్దంలో భారత పర్యటన చేసిన మెగస్తనీసు వ్రాసిన వ్రాతలను బట్టి తెలుస్తోది. మూడవ శతాబ్దంలోని అశోక చక్రవర్తి సాసనాల్లోకూడా ఆంధ్రుల ప్రస్తావన వచ్చింది. ఐతే ఆరొజుల్లో ఆంధ్రులది ఒక ఆదివాసి రాజ్యం అని పెర్కొంటారు.కాని మెగస్తనీసు, అశోకుల కంటె కూడా ప్రాచీనములైన భారతీయ వేదసంబంధులైన బ్రాహ్మణ గ్రమ్థాలలోను, రామాయణ భారతాలలోనూ వీరిని గురించి చెప్పబడింది అన్నాక మెగస్తనీసు, అశోకుల మాట ఈ విషయాన్ని బలోపేతం చేస్తోందని చెప్పాలే కాని వారిదే ప్రధాన ఆధారం అని చెప్పనక్కరలేదు. కొందరు ఆధునికులు భారతీయ చరిత్రను చెప్పే ఇతిహాసాలను, పురాణాలను పుక్కిటి గ్రంథాలని చెప్పి వాటికి విలువలనీయక పోవడం భారతీయ గ్రంథాలను కించపరచడమే.

No comments: