Wednesday, August 8, 2007

Shayari :Telugu lo kaburlu చెప్పాలని ఉంది !

ఎంటీ తాజ్‌మహల్‌కు ఓటెయ్యాలా ? June 25, 2007

Posted by kasyap in Uncategorized. 2 comments

ఎంటీ ప్రపంచంలోని ఏడు వింతల్లో చోటుదక్కటానికి తాజ్ కు ఓటెయ్యాలా - ఇది ఒక ప్రైవేటు చిట్టా దీనికి ఎటువంటి అధికారం లేదు - నేను వెయ్యను , తాజ్‌మహల్‌కు ఓటెయ్యాలా - ఇది ఒక ప్రైవేటు చిట్టా దీనికి ఎటువంటి అధికారం లేదు - నేను వెయ్యను ,

తాజ్‌మహల్‌ఈ మద్య ఇది బాగాపెరిగి పోయినది ప్రపంచంలోని ఏడు వింతల్లో భారత్‌కు చెందిన చారిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌కు చోటు దక్కుతుందా అనే విషయం ఆగమ్యగోచరంగా ఉంది. ఇందుకు కారణం ఇటీవల నిర్వహిస్తున్న ఆన్‌లైన్ సర్వేలో ప్రస్తుతం ఉన్న ఏడు వింతలపై ప్రజాభిప్రాయ సేకరణ తాజ్‌మహల్‌కు భిన్నంగా ఉండటమే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 కట్టడాలపై నిర్వహిస్తున్న సర్వేలో మొత్తం 21 కట్టడాలు తుదిగా నిలిచాయి. ప్రస్తుతం ఏడో వింతగా ఉన్న తాజ్‌మహల్‌ ఆ జాబితా నుంచి తప్పుకుంది. అయితే తాజ్‌మహల్‌కు ఓటు వెయవలసినది గా అబ్యర్దిస్తూ జాబులు SMS వస్తున్నాయి.అసలు ఈ ఓటంగ్ సరళి చాలా విచిత్రంగా ఉన్నది దీని కోసము మీకు Internet accout గాని Mobile Phone గాని వుండాలి :( , మీకు ఓటు వెసిన రుజువు కోసం Certificate voting కు US$2,లేదా దీనికో సము +423 663 90 02 99 call చేయాలటలేదా on line లో, ఎన్ను కోవాలట ,SMS ద్వారా కూడా ఎన్నుకో వచ్చట అన్నిపక్రియలు వ్యయపూరిత మయినవి పైగా ఇది ఒక వ్యక్తిగత చిట్టా ఇలా మనం ఎవరన్నా చిట్టాలు తయారు చేయవచ్చు ఇలాంటివి వుపయోగించి ప్రజల మానసిక ఉద్వేగాలను చక్కగా సోమ్ము చేసుకోవచ్చు ఇంకా బోలేడు జాబితా (data), ప్రచారం కూడా లబిస్తుంది. ఇక విషయానికి వస్తే ఈ ఓటింగు పూర్తి గా ఒక గిమ్మిక్కు ,ఇది ఒక swiss కంపెనీ వాడి మాయ వీడు http://www.new7wonders.com/ పేరుతో ఒక టూర్ నడుపుతూ ఉంటాడు వీడు మన తాజ్‌మహల్‌ అబివ్రుద్దికి ఒక్క డాలరు కూడా ఇవ్వడు అంతే కాక దీనిపై సర్వే నిర్వహిస్తున్న బెర్నార్డ్ వెర్బర్ చెపితేనే తాజ్‌మహల్‌ కు కోత్తగా వచ్చేదేమి లేదు , అసలు UNESCO వాడికే మన తాజ్ గురించి మాట్లాడే అధికారంలేదు.ఇలాంటి పనికి రానివిషయాలి మీద మన మీడియా ప్రత్యేక మమకారం అసలు ఒక విషయంగురించి మాట్లాడేటప్పుడు సరి అయిన పరిశోదన చేసి విచక్షణ తో ఎందుకు స్పందించరు ? ఖర్మకాలి మన ప్రర్యాటక మంత్రి అంబికా సోని గారు మీడియా సమక్షలో SMS ద్వారా ఓటు వేసారు ఆ మూడు రూపాయలను తాజ్‌మహల్‌ అభివృద్దికి వెచ్చించినా ఈపాటికి కోన్నిలక్షల రూపాయలు జమఅయ్యేవి .

PS : ఇది రాసే సమయానికి Lisbon వాడు తుదిజాబితా ప్రకటించటానికి ఇంకా 11 రోజుల 11 గంటల సమయం మిగిలి వున్నది.దయచేసి ఈవేలంవెర్రి గురించి be MAD! (Make A Difference )

పందులే గుంపుగా వస్తాయి…సింహం సింగిల్‌గా వస్తుంది June 15, 2007

Posted by kasyap in Uncategorized. 6 comments

ఓ ఎన్‌.ఆర్‌.ఐ. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ ఆర్కెటెక్ట్‌గా ఉంటూ రూ.250 కోట్లు సంపాదించి స్వదేశానికి తిరిగివస్తాడు. తాను సంపాదించిన సొమ్ముతో ఎన్‌.ఆర్‌.ఐ. ఫౌండేషన్‌ ఏర్పాటు చేయాలనీ, ఓ యూనివర్శిటీ, ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వంటివి నిర్మించి ఉచిత విద్యావైద్య సదుపాయాలు కల్పించాలన్నది అతని ఆశయం. ఎన్‌.ఆర్‌.ఐ.కి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని తల్లిదండ్రులు అనుకుంటారు. సంప్రదాయంగా ఉండే అమ్మాయిని చేసుకుంటానని ఎన్‌.ఆర్‌.ఐ.చెబుతాడు. ఒక అమ్మయిలో అలాంటి లక్షణాలే కనపడటంతో ఆమెను ప్రేమిస్తాడు. ఇక ఫౌండేషన్‌ ఏర్పాటు విషయంలో తనకు సహకరించాల్సిందిగా ఒక బిజినెస్‌మెన్‌ ను ఎన్‌.ఆర్‌.ఐ.అడుగుతాడు.ఉచిత విద్య, వైద్యం అందిస్తే తన విద్యావైద్య సంస్థలు మట్టికొట్టుకుపోతాయనే భయంతో ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఎన్‌.ఆర్‌.ఐ.కి అడ్డుతగులుతాడు. అతని కుట్ర కారణంగా ఎన్‌.ఆర్‌.ఐ. తన ఆస్తులన్నీ పోగొట్టుకుని పాపర్‌ అవుతాడు. దాంతో ఎన్‌.ఆర్‌.ఐ.ని హేళన చేస్తూ ఓ రూపాయి ముష్టిగా పడేసి బిచ్చమెచ్చుకుని బతకమని ఆ బిజినెస్‌మెన్‌ సలహా ఇస్తాడు. అదే రూపాయి పెట్టుబడిగా తన ఆశయాన్ని సాధించుకుంటానని ఛాలెంజ్‌ చేసిన ఆ ఎన్‌.ఆర్‌.ఐ.బ్లాక్‌మనీ దాచిన ఘరానా పెద్దమనుషుల ఆటకట్టిస్తాడు. ఈ క్రమంలోఆ బిజినెస్‌మెన్‌ పై ప్రతీకారం తీర్చుకొని తన ఎన్‌.ఆర్‌.ఐ. ఫౌండేషన్‌ లక్ష్యం నెరవేర్చుకోంటాడు ….

ఇది ఎన్నాళ్ళ నుండో ఎదురు చూచిన కద ,
మళ్ళా దీనికి 75 కోట్లు ఎందుకు ?
టిక్కెట్ల కోసంవారంరోజులు పడిగాపులు ఎందుకు ?
నాకెందుకో బాబానే నచ్చినది (దాని కోసమయితే మద్రాసు నుండి కాలేజి మానుకోని అంద్రావచ్చి చూశా!)
ఇంకా నయం ఈ సినిమా చూసినది రేడియో మిర్చి వాడి సౌజన్యంతో కాబట్టి పెద్దగా బాదలేదు …..

ఇంకోక విషయం ఎమిటంటే నేను సింగిల్‌గానే వెళ్ళా …..

పచ్చబొట్టు చెరిగీపోదులే…. June 2, 2007

Posted by kasyap in Uncategorized. 2 comments

ఈ రోజు (శనివారం అధిక జ్యేష్ఠ విదియ) covansys interview కి నన్ను coordinator గా వెళ్ళ మన్నారు మా ప్రదాన కార్యాలయం వారు , సరే తప్పదు కదా అని వెళితే అక్కడ అంతా గందరగోళం గుంపును ఒక గాడిలో పెట్టేవరకి తల ప్రాణం తోకకోచ్చినది అదేదో పార్కుకి వచ్చినట్లు కోంతమంది పెళ్ళాం పిల్లలతో వచ్చారు బహుశా అలుమోగలు ఇద్దరూ వచ్చారేమో .అసలు interview కి వచ్చిన వాళ్ళ కన్నా వారితో తోడుగా వచ్చినవారి సందడి బాగావున్నది ఇంతలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి “మీది భద్రాచలం కదా ” అని అడిగాడు నేను అవునని మీ కెలా తెలుసునని విస్మయంగా అడిగాను.అతను చిరునవ్వు తో తన చేతిపైన పచ్చబోట్టును చూపించాడు. అది నా పేరే! ఇక నాకు మాటలు రాలేదు ..ఒక కేక పెట్టి గట్టిగా వాటేసుకున్నాను ఆ క్షణం లో నేను Interviewer తను interviewee అన్న విషయంగుర్తురాలేదేమిటో .. ….

cut చేస్తే,

1993 శ్రీరామాలయం , రాజవీది భద్రాచలం.

మేము ఇద్దరం (నేను,శివ) చదువుకునేది ఒకే చోట, ఇళ్ళు కూడా ఒకే వీదిలో ,సెలవలు వస్తేచాలు ఆ ఇరువురిదీ ఒకే మాట ,ఒకే ఆట ఎప్పుడూ గోదారి ఒడ్దున ఆడుకోవటం ,గుళ్ళో పెట్టే ప్రసాదాలు తినటం , రోజూ జరిగే వూరేగింపులో పాల్గోనటం .గుళ్ళో కోతులను తరమటం ఒకటేమిటి , మమ్మలిని ఆపేవారెవరు ? అడిగేవారేవరు ??.ఎంతో వుల్లాసంగా గడిపే వాళ్ళం పరీక్షలో మాఇద్దరి కీ first class వచ్చినది ,దానితో పాటే ఒక దుర్వార్త శివ వాళ్ళనాన్న గారికి కోయంబత్తూరు లో ఉద్వోగం వచ్చిందట జాయన్ అవ్వటానికి ఇంకా వారమే గడువు .చాలా బాదవేసినది మా స్నేహం చిరస్తాయిగా గుర్తుండి పోవటానికి ఇద్దరం చేతిమీద పచ్చబొట్టు పోడిపించుకోందామనుకోన్నాం అనుకున్నదే తడవు గా శివ నాపేరు తన చేతిమీద రాయించు కోన్నాడు అదేమిటో వాడి చేతి మీద బాగానే రాసిన మిషను నా దగ్గరకు వచ్చేసరికి మోరాయించినది :( , రేపు రమ్మని చెప్పాడు పచ్చబోట్లు వెసేవాడు ఆ రోజు రాత్రి మా నిర్వాకం ఇళ్ళలో తెలుసినది వెదవ వేషాలు వేసావంటే తోలు తీస్తానని మా నాన్న గారు హెచ్చరించారు ,ఆ పచ్చబొట్టు ఎలర్జీవచ్చి మా శివ మూడురోజులు లేవలేదు ఈ లోపల నేను ఇంట్లో జడిసి ఎలాంటి సాహసం చేయలేదు.వాడికి చేయి నయమవగానే శివ నన్ను వెంటబెట్టు కోనీ మరీ ఆ పచ్చబోట్టు వాడు వుండే ప్రదేశానికి వెళ్ళాము , వాడు బిచాణా సర్దుకోని రాజమండ్రి వెళ్ళాడని తెలుసింది నాకు మోఖం చెల్లలేదు . పాపం శివ ! అప్పడి నుండి వాడు నాతో మాట్లాడలేదు నాకు కూడా కోయుంబత్తూరు లో వాళ్ళ చిరునామా తెలియదు .

.. ఇప్పడు శివ కలిసాడు ,హైదరాబాదు లో ఉద్వోగాన్వేషణలో వున్నాడట , తనకి పెళ్ళి కూడా అయిపోయినదట ఇంకా నాపేరు తోవున్న పచ్చబొట్టు ని చూసి ఇదవరకు హైదరాబాదు లో రోజుకు ఒక్కరయినా అడిగేవారట తను ఇప్పుడు తివెండ్రం లో మకాం కాబట్టి ఇప్పుడు వారానికి ఒక్కళ్ళు అడుగుతారట ,తన భార్య చాలాసార్లు Plastic surgery చేయుంచుకోమ్మని ఆడిగిందట . నేను ఎలా ప్రతిసస్పందించాలాలో తెలవలేదు ఇద్దరంకలసి బోజనం చేసాము,

చివరిగా వీడుకోలు చెపుతూ ఇక పై నన్ను పచ్చబొట్టు వేయించు కోవద్దని ఓట్టు పెట్టీ మరీ వేళ్ళాడు నా శివశంకర్ …………… కిం కర్తవ్యం ?

ఇవి వార్తలా ! May 26, 2007

Posted by kasyap in Uncategorized. 9 comments

చిన్నపిల్ల ల పై అత్యాచారాలు,ముసలి వాడిను బూటు కాలితో నిర్దాక్షణం గా తన్నే పోలీసు ,సున్నితమయి న భావాలను రెచ్చకోట్టే విదముగా కదానికలు విచక్షణ కోల్పోయి మాట్లాడే వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్,విది వంచితులను వినోదం గా చూపే రిపోర్టులు,కాలిన కుళ్ళిన గాయపడిన,తెగిపడిన శరీరావయవాలను జుగుస్పాకరంగా చూపటంలో ఔనత్యం ఏమిటో వీరికే తెలియాలి , ఒక్క దూరదర్శన్ తప్పితే మిగిలిన న్యూస్ చానల్ అందరిదీ ఒకటే బాట !,ఇక దూరదర్శన్ విషయాంకి వస్తే ఖర్మ కాలి ఇది రోజు రోజుకూ వెనుకకు పోతోంది కళాకారులు తన నటను ,ప్రదర్శనను చిరకాలం చూడాలంటె మన సప్తగిరి లో ఒక ప్రదర్శన ఇవ్వాలి , ఈ DD కళాకారులు నిఝంగా చిరంజీవులు. Telugu News Channels చూస్తుంటే కడుపులో దెవేసినట్లు అవుతోంది .ఒక భక్తి పేజీ,ఒక చిన్నపిల్ల పేజీ వేసి మిగిలిన పేజీ లన్నీ రక్తి తో నింపే స్వాతి పత్రిక లాగ వీటి లోకూడ మంచి కార్యక్రమాలు వున్నాయి. నా చుట్టూ కూడ ఇలాంటి విపరీత మార్పు లు వస్తా(వచ్చా)యేమో అని భయమేస్తోది,ఇప్పటికే అపరిచితులు కు లిప్ట్ ఇవ్వాలంటె ఒక రక మయిన భయమమేస్తోది,ఇదవరకులా చిన్నపిల్లలితో చనువుగా ఉండలేక పోతున్నా :( .సమాజం మీద అసయ్యం ,మానవ సంబందాల మీద జుగుప్స కలుగుతోంది ,ఎప్పుడో ఓకసారి టివీ చూశే నాకే ఇలా అనిపిస్తుoటే ,రోజూ చూసే వారికి ఎలావుంటుందో, బహుశా వారి కి ఇవి అలవాటై వుండవచ్చు :-మనిషికి సాటి వారి మీద తన చుట్టూ సమజంమీద నమ్మకం ,ప్రేమ బాద్యతను పెంచవలసిన వీరే ఇలా అయిపోతే ఇంకెవరు ఉద్దరిస్తారు ?

దీనిని ఎలా ముగించాలో తెలియక రాయుటకు మాటలు లేక పోవుట చే ఇంతటితో ముగిస్తునాను .

సరిఅయిన చర్యలు ఎమిటో తెలుసుకోవాలని ఉంది ! May 18, 2007

Posted by kasyap in Uncategorized. add a comment

బాంబుదాడి తీవ్రవాదుల పనే అని స్పస్టంగా తెలిసినా కూడా శనివారం బందుకు పిలుపు నివ్వటం మరీ విడ్డూరం-”నో రీజనింగ్‌ ఇన్‌ పాలిటిక్స్‌”

మానవతా విలువలు మటుమాయమై మతం అన్నపదానికే
పెడార్ధాలు వర్ణిస్తూ మతకలహాల అగ్నిజ్వాలలు రేపుతున్న
ఈ సమాజం, ఇదేనా మనసమాజం!
అనుకోని ఆపద వచ్చినపుడు బాధితులను ఆదుకోవలసిందిపోయి, నిరసన తెలుపడం కోసం బంద్‌కు పిలుపునివ్వడం సమంజసంగా లేదు.దానికి తోడు మీడియాలో పదే పదే ప్రసారాలు భవంతి మీద దాడి జరిగిందన్నప్పుడు ప్రజల సైకాలజీ వేరే వుంటుంది, ప్రార్దనా మందిరం మీద దాడి జరిగిందన్నప్పుడు వారి సైకాలజీ వేరే వుంటుంది.జనాలను రెచ్చగోట్టి పబ్బంగడుపు కోవటంలో వీరిని మించిన వారు లేరు.మెరుగయిన సమజం కోరకు పాటు పడుతున్నామంటూ వున్న సమాజాన్ని రెచ్చగోట్టే చానల్ వాడికి దాసులవటం మన ఖర్మ ( ఎదో సంస్కౄతి చానల్ పెడుతున్నారట..బలే పబ్లిసిటి!).
అసలు ఈ ప్రజలే ఎందుకు అంతగా ఎగబడుతారు?..పోలీసులు తంతామన్నా సరే.ఎందుకంత రిస్క్‌ తీసుకుంటారు ,
మత ఛాందస శక్తులు మత భావాలను రెచ్చగొట్టే విధంగా ?
చాలాసార్లు హింసాత్మక ప్రదర్శనలు బాబ్రీమసీదు కూల్చివేత, ఆఫ్గనిస్తాన్‌, ఇరాక్‌లపై అమెరికా దాడులు, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ హైదరాబాద్‌ రాక వంటి సందర్భాల్లో ఈ మక్కా మసీదు ప్రాంతం నుంచి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు. అప్పుడు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరిగేవి.ఈరోజు జరిగినయి ఎందువలన ?”పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు కాల్పులు జరపడం సరైనచర్య కాదట - మరి సరిఅయిన చర్యలు ఎమిటో ?

నా చెవులు ర్మింగు మని మారుమోగేదాకా…. April 28, 2007

Posted by kasyap in Uncategorized. 5 comments

సమయం : ఉదయం 7:30
(ఇంకా మగత నిద్రగావున్నది)
ట్రింగ్గ్ ట్రింగ్గ్! ట్రింగ్గ్ ట్రింగ్గ్ !!
1: హలో కశ్యప్ గారేనా,
2:హా, చెప్పండి
1:నమస్కారమండి మీకు పెళ్ళి అయినదా
2:లేదండీ , ఎందుకు ?, ఏవరు మీరు ??
1: సార్ నేను ఫలానా క్లబ్బ్ నుండి మాట్లాడుతున్నాను మీకు లక్కి డ్రాలో బహుమతి వచ్చి నాది ,కాని దీనిని తీసుకోవటానికి కి కపుల్స్ మాత్రమే రావాలి ….
మీ అమ్మనాన్న ,అన్నవదినా లేదా మీరు ఎవరితో నన్నా వచ్చినా పరవా లేదు .
– చివరికి వెళ్ళితే అక్కడ చాలా మంది బాదితులు రెండు గంటలపాటు వాడు చెప్పినది విని చివరికి ఒక చిన్న ప్లాస్టీకు పాత్ర తో వెను తిరిగాను .. పాపం నా తోపాటు వచ్చిన నా సహోద్యోగిని :(
సమయం : ఉదయం 9:30
(అమీరుపేటలో ఘోరమయిన ట్రాఫిక్క్ నిస్సహాయ స్తితి లో )
ట్రింగ్గ్ ట్రింగ్గ్! ట్రింగ్గ్ ట్రింగ్గ్ !!

1:Haloo is this Kasyap?
2: ya this is kasyap tell me
1: you are selected as preferable user of City Cards ,congratulations
2: oh thanks its means what?
1:now you are eligible for cash Loan Rs:1,00,000
2:oh that’s nice
1:do you want DD or check deposited in your account
2: no sir, at the moment I am not looking for Loan thanks for your call byebye
వీళ్ళకి మన DOB ,personal details చెప్పి మూడు సార్లు “ఊ !” కొడితేచాలు అ డబ్బులు తిరిగి చెల్లించలేక నానా అవస్తలు పడాలి , చిన్నప్పు విన్న గడ్డీ,బెల్లము,మెరపకాయ ,గాడిద కదలో వరసగా “ఊ” కోట్టే దాని కన్నా చాలా ప్రమాదము ….

మొన్న ఒక హిందీ సినిమలో విలన్న్ కు పదే పదే కాల్స్ వస్తూవుంటాయి (వాడు పోలీసులకి కూడాతెలవని మొబైలు నంబరు వీళ్ళకు ఎలాతెలునునన్ని తెగ హాచ్చర్య పడతాడు , any way he took his action in his own style ), కానీ ఒక సమయము సందర్బము లేకుండా ఇలాంటి కాల్స్ రోజూ బోలేడు వస్తుంటాయి ఒక్కొసారి నిగ్రహం కోల్పోయి మాట్లాడుతుంటాను … అయినా తప్పుదు కాల్స్ వస్తునే ఉంటాయి నా మోబైలు నెంబరు మార్చ కుండా దీనిని అడ్డుకోను మార్గము లేదా , ఆ సినిమా లో విలన్న్ లా నాకు అంగబలము, అర్ద బలము రెండూ లేవు, నా చెవులు ఇలా ర్మింగు మని మారుమోగవలసినదేనా.. :(

..హతవిదీ ! April 22, 2007

Posted by kasyap in Uncategorized. 6 comments

గత రెండు రోజుల న్నుండి ఒక మీడియాలో ఒకటే గోల.“బాలీవుడ్‌ జంట అభిషేక్‌ బచన్‌, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ ఇప్పుడు ఒక్కటయ్యారు.”ఏ చూసినా ఇవే బలే చిగాకు పుట్టినది రమారమి అన్నిపత్రి కలలో విలువయిన మోదటి పేజి,అన్ని లలో దీనికే కేటాయించారు ఎంత దనము సమయము వౄదా .ప్రతి ఒక్కటీ డబ్బులు పెట్టి చూస్తామే ఇదా వీళ్ళు అందచేసేది . అసలు మనలో చైతన్యం రావాలసిన అవసరం చలా వున్నది అయీనా మన ప్రతినిదులుగా చెప్పుకోనే వీళ్ళకి కనీస విచక్షనా ఙానం వుండ వలసిన అవసరము లేదా వీరిదయ వలన పక్క వాడిని అనుమామనమంగా చూడటం మొదలు అయినది . బయటకు రావాలాంటే బయమేస్తోది ప్రతి రోజు ఎంతో ఒత్తిడి పెరిగి పోతొంది ఫలితం మానవ సంబందాల క్షీనత ,వున్మాదం / అసయాయత మితి మీరిన దైవబక్తి… హా ఇప్పుడె వివాహమైన అనంతరం కొత్తదంపతులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యా రాయ్‌లతో అమితాబ్‌ దంపతులు, అనిల్‌ అంబానీ కుటుంబం స్నేహితులు, బంధువులతో స్వామివారి దర్సనం చేసుకోన్నారట ఈ టీవీ , టీవీ 9 లోచూపిస్తున్నారు …:( ..హతవిదీ !

ఓ ..పాలబుగ్గల జీతగాడా ! April 17, 2007

Posted by kasyap in Uncategorized. 2 comments

పాలబుగ్గల జీతగాడా
పసులుగాసె మోనగాడా
పాలుమరచి ఎన్నాళ్ళయిందో
ఓ ..పాలబుగ్గల జీతగాడా
కోలువు కుదిరి ఎన్నాళ్ళయిందో !

చాలిచాలని చింపులంగి
చల్లగాలికి సకమకాలి
గోనె సంచి కొప్పునీపెట్టావా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
దానిచిల్లులెన్నో లెక్కబెట్టావా !

తోలు జగ్గల కాలిజోడు
తప్పటడుగుల నడకతీరు
బాటలో పనిలేకుండయిందా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
చేతి కర్రె తోడై నిలిచిందా !

మాయ దారి ఆవు దూడలు
మాటి మాటికి ఎనుకు దునికి
పంట చేను పాడు చేశాయా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
పాలికాపు నిన్నే కోట్టాడా !

(ఇది చిన్నప్పుడు రేడియోలో వినేవాడిని ఇక ఎన్ని చరణాలు వున్నాయో గుర్తులేదు , రాసినది ఏవరో కూడా తెలియదు కాని శ్రవ్యంగా పాడితే చాలా ప్రభావితముగా వుంటుంది …ఎప్పుడోవిన్న పాట తప్పులు వుంటె ఎత్తి చూపండి సరి చేసుకోంటాను)

నాకు గౌరవము ఇవ్వండహో! April 16, 2007

Posted by kasyap in Uncategorized. 2 comments

ఈమద్య చూసిన ఒక mail కి రాయాలని పించినది

http://oremuna.com/blog/?p=1067

ఎవరు ఎవరిని మార్చాలి అసలు ఎందుకు మార్చాలి , ఎవరు మిమ్మలను మర్చాలి ,మీరు ఎందుకు మారాలి? , వాడికి ఏ అదికారము వున్నదని మార్చాలి.హిందూ మతము ,ఒక మతమే కాదు ఒక దర్మము దీనిని పాటించటానికి ఏ బాబానో, స్వామో రావలసిన అవసరము లేదు , అసలు మతమే లేనప్పుడు ఒకడికి ఆమతము మీద మతాదికారమూ లేదు బేషూగ్గా ఈ దర్మాని పాటించవచ్చు ఇంకా కావానుకోంటె మీ పేరు చివర ఏ శర్మ,రెడ్డో పేట్టుకోండి ! , కాని మీరు ఈ కుల బీజమును రూపుమాపలెరు
ఎందుకంటె ఇది భారతదేశము. చివరికి మీరుకూడా “నన్ను హిందూత్వంలోకి ఆహ్వానించి బ్రాహ్మణిడిగానో, రెడ్డిగానో, రాజుగానో, కమ్మగానో చేస్తే ఆనందంగా స్వీకరిస్తాను.అందుకోసం నా బి.సి.రిజర్వేషన్ను కూడ వదులుకుంటాను. ” ఇంకా కుల భావమకువదిలి వేయులేదు అసలు ఈరోజుల లో అగ్రకుల మున్నదే లేదు వున్నవల్లా ఆర్దిక అసమానతలు ! ప్రతివాడు తన స్వాబిమానము కాపాడు కోవాలి ,అది తననుండే రావాలి దూదేకుల వాడిగానో ,దళితుడిగానో చెప్పుకోవటానికి మొహమాటము పడనఅవ్ససరములేదు , నాకు గౌరవము ఇవ్వండహో! అని ఎవడవిడినో అడగ వలసిన అవసరము అంతకన్నాలేదు…

ఏమిటొ అసలు ఈ జీవితము March 20, 2007

Posted by kasyap in Uncategorized. 1 comment so far

ఏమిటొ అసలు ఈ జీవితము లో మరీ మలుపులు ఎక్కువయి పోయినాయి అసలు పండగ ఎప్పుడొ తెలుకునె అప్పటి కే పండగ వెళ్ళిపోతోంది. హామ్మ నిన్న కొన్ని తొరణము ఇవ్వాళ కొన్ని తోరణము,
నిన్న రెండు సార్లు తలస్తానము (షాంపూ లేకుండా),ఇవ్వాళ ఒక సారి షాంపూతొటి
నిన్న పరవన్న నవేద్యము ఈరోజు కొబ్బరి కాయ,నిన్న స్వయంపాకము ఈ రోజు మెస్సు లో ఉగాది ప్రతేక బోజనము, ఇలా నా ఉగాది గడచినది..

ఈ సర్వబాదలను ఈ సర్వ జిత్ నామ సంవత్సరం లో చిత్తు చేయాలని వున్నది -(అంటే దీని అర్దం పెళ్ళి చేసుకోంటా నని ఖచ్చితముగా కాదు),

మరి ఉగాదికి కవిత రాయాలి కదా !

నిర్బయ మయిన మనస్సు ,అలొచలా అలోచనాని శిరస్సు

మటుమాయమయినాయి వెలుగు నీడల తెరలు

హరించి పోయినది ప్రతి దుఖభాష్పం’

గతించి పోయాయి క్షనికానంద ఉషోదయాలు

ఒక చిన్ని నవ్వు బుడగనినేను

అయిపోయూను ఆనంద సాగరముగా!
ఉగాది శుబాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మరింత ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ ….
మీ శ్రేయోబిలాషి
కృపాల్ కశ్యప్
తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది !

No comments: